1932వ సంవత్సరం జూలై 11వ తేదీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రము లోని గుంటూరు జిల్లా లోని నిడుబ్రోలు గ్రామం లొ జన్మించినాను. మా అమ్మ గారి పేరు ఆదేమ్మ. మా నాన్న గారు కొట్టయ్య గారు. నాకు అయిదుగురు సొదరులు, ముగ్గురు సొదరీమణులు.
నేను అతి పేద కుటుంబము లో జన్మించినాను. పేదరికాన్ని అధిగమించడానికి చదువు చాలా ముఖ్యమని మా నాన్న గారి అవగాహన. తన లా మేము కూడా పేదరికం లో ఉండకూడదని మా పిల్లల్లందరిని పనికి రావద్దని బడికి వెళ్ళమని, ప్రోత్సహించారు. అందులకై మా అమ్మ నాన్న లకు నేను సర్వదా క్రుతజ్ణుడను.
1955వ సంవత్సరం లో గుంటూరు జిల్లా లోని చేబ్రోలు వాస్తవ్యులు శ్రీ చాట్రగడ్డ పిచ్చయ్య, కాశమ్మ గార్ల ఏకైక కుమార్తె వెంకట సుబ్బమ్మ గారితో నా వివాహం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర అర్నలిష్టు సంఘ అద్యక్షులు, రాడికల్ హ్యూమనిస్ట్ ఆవుల గోపాల క్రుష్ణమూర్హ్తి గారు "సామాజిక పెళ్ళి" పద్దతి లో నిర్వహించారు.
నాకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు.
దేవరపల్లి కవీ! నీ భావాశ్వము లేబదేళ్ళు పరుగులు తీయన్ సేవామయ హ్రుదయము గల పావన జీవను డవంచు చేతున్
"దళిత దశాబ్డము" నందున కళలకు నీవిచ్చినావు కమ్మని రూపున్ కళలందున మానవపరి మళముల వెలయించినావు మస్తాన్ రావూ !
కాకుల లొకములో నీ వేకాకిగా నిలచి పోరి ఈర్ష్యాసూయా లోకపు కాకుల కేకల మేకులు భరియించి నట్టి మేరు సమానా !!
నీ కవితా రసఝరిలో నాకము కనిపించునంచు నాకనిపించున్ లోకపు శోకము నీదౌ శ్లోకాములో చెక్కుచున్న శోభామూర్తీ !!
డెందము చిందులు వెసెడి అందలమందించినావు ఆంధ్రకవితకున్ అందాలా విందు చేసెడి కందము లందించు చుంటి కైమోడ్పులతో