1932వ సంవత్సరం జూలై 11వ తేదీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రము లోని గుంటూరు జిల్లా లోని నిడుబ్రోలు గ్రామం లొ జన్మించినాను. మా అమ్మ గారి పేరు ఆదేమ్మ. మా నాన్న గారు కొట్టయ్య గారు. నాకు అయిదుగురు సొదరులు, ముగ్గురు సొదరీమణులు.
నేను అతి పేద కుటుంబము లో జన్మించినాను. పేదరికాన్ని అధిగమించడానికి చదువు చాలా ముఖ్యమని మా నాన్న గారి అవగాహన. తన లా మేము కూడా పేదరికం లో ఉండకూడదని మా పిల్లల్లందరిని పనికి రావద్దని బడికి వెళ్ళమని, ప్రోత్సహించారు. అందులకై మా అమ్మ నాన్న లకు నేను సర్వదా క్రుతజ్ణుడను.