1959వ సంవత్సరం లో స్వగ్రామములైన నిడుబ్రోలు , పొన్నూరు మేజర్ పంచాయితీలకు జాయింట్ పంచాయత్ ఓవర్ సీయర్ గా భాధ్యతలు స్వీకరించాను.
1960 సంవత్సరం లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ (PWఢ్)రహధారు మరియు భవనములు శాఖ లొ సుపర్ వైజర్ గా ఉద్యోగ భాధ్యతలు స్వీకరించాను. ఉద్యోగ రీత్య తెనాలి, రాజుపాలెం, కోవూరు, నందిగామ, పిడుగురాళ్ల, నర్సరావు పేట, రేపల్లే, నెల్లూరు సంచరించాను. 1992 లో అసిస్టెంట్ డివిజనల్ యింజనీర్ గా పదవీ విరమణ చేసాను.
పదవి విరమణ చేసే నాటికి నాకు ఒక స్వంత ఇల్లు కూడ సమకూర్చుకొలేని ఆర్దిక పరిస్తితి. నా సంపాదన తమ్ముళ్ల చదువులకు, చెల్లేళ్ల పెళ్లిలకు వయో భారం లొ ఉన్న అమ్మా నాన్న ల బాగోగులకు, పిల్లల చదువులకు పోగా మిగిలినది నా ప్రవ్రుత్తి అయిన రచనా వ్యాసాంగానికి సమాజ ఉత్ ప్రేరణా చర్యలకు సరిపొయింది.
వ్రుత్తి తోపాటు ప్రవ్రుత్తి సమపాళ్ళ లో నిర్వహిస్తూ సర్వీసు రిజిష్టర్ లో ఒక్క మచ్చ అయినా పడకుండా సమన్వయించుకుకొని, పదవీ విరమణ చెయడం నా జీవితం లో గర్వించ దగిన విషయంగా భావిస్తాను.