నా చదువు వీది బడి లో ప్రారంభం అయినది. ఉన్నత తరగతుల నిమిత్తము 2 కిలోమీటరు ల దూరములో ఉన్న ఎడ్వర్డ్ బోర్డ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పూర్తి చేసాను. ఆ కాలములో ఇంటిలో భోజన సదుపాయం ఉండేది. దుస్తులకు పుస్తకాలకు అయ్యే ఖర్చు స్వయంగా సంపాదించుకోవలసిన అవసరం చిన్న వయస్సు లొనే గుర్తించాను. ఉదయాన్నే పాఠశాల గదులను శుభ్రము చేయడం ద్వారా నెలకు ఒక రూపాయి సంపాదించేవాడిని.అలాగే మధ్యాహ్నం ఉత్తరాలు బట్వాడా చేసినందుకు మరో రూపాయి సంపాదించేవాడిని. అలా సంపాదించిన 24 రూపాయిలుతో 2 జతల దుస్తులు, పుస్తకాలు కొనుక్కునే వాడిని.11వ తరగతి లో ఉత్తీర్ణత సాదించలేకపోయాను.
అదే సమయంలో నాతో పాటు నా మొదటి తమ్ముడు వెంకటేశ్వర్లు ఉతీర్ణుడయ్యాడు. నేను పనిచేస్తు నా తమ్ముడ్ని చదివించాను. 1956 వివాహం వెంకట సుబ్బమ్మ గారి తో జరిగింది. వెంకట సుబ్బమ్మ గారు SSళ్C పాసై ఉండటము వలన గుంటూరు కలెక్టర్ ఆఫీస్ లో గుమస్తా ఉద్యొగము వచ్చినది.
నా చదువు మరల వెంకటేశ్వర్లు అనంతపూర్ యింజనీరిన్గ్ కళాశాల లో లెక్చరర్ గా పని చేస్తు నన్ను నా రెండవ తమ్ముడు శ్రీమన్నారయణను చదివించాడం జరిగింది.
1956 - 1959 లో, ఆ విధంగా నేను డిప్లమొ యిన్ సివిల్ యింజనీరింగ్ పూర్తి చెశాను.
నా చదువుకు సహకరించిన నా సతీమణి వెంకట సుబ్బమ్మ గారికి, నా పెద్ద తమ్ముడు వెంకటేశ్వర్లుకు సర్వద క్రుతజ్ణుడిని
జాతీయ భాష పై మక్కువతో దక్షిణ భారత ప్రచార్ సభ వారి "మాధ్యమిక" పరీక్షలో కూడా ప్రదమ శ్రేణి లో ఉత్తీర్ణత సాదించాను.